క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్: మీ రివార్డ్ పాయింట్లను కాపాడుకోండిలా!
- నిశ్శబ్దంగా అమలవుతున్న క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్!
- రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లపై పరిమితులు విధిస్తున్న బ్యాంకులు
- పాయింట్లను ఎప్పటికప్పుడు రీడీమ్ చేసుకోవాలని నిపుణుల సూచన
- కార్డు ప్రయోజనాలు తగ్గితే ఫీజులు సమీక్షించుకోవడం అవసరం
- బ్యాంకుల నుంచి వచ్చే సందేశాలను తప్పక గమనించాలని సూచన
క్రెడిట్ కార్డుల ద్వారా లభించే క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు, ఇతర ప్రయోజనాలను బ్యాంకులు క్రమంగా తగ్గిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకులు తమ పాలసీలను మార్చడాన్ని 'క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్' అంటారు. ఈ నేపథ్యంలో కార్డుదారులు తమ రివార్డుల విలువ పడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
డీవాల్యుయేషన్ ఎందుకు జరుగుతోంది?
నిర్వహణ ఖర్చులు పెరగడం, వినియోగదారుల ఖర్చు చేసే విధానాల్లో మార్పులు, లాభదాయకతను పెంచుకోవడం వంటి కారణాలతో బ్యాంకులు రివార్డ్ పాయింట్ల విలువను తగ్గిస్తున్నాయి. రివార్డ్స్ సంపాదించడంపై పరిమితులు విధించడం, క్యాష్‌బ్యాక్‌ను కుదించడం, రిడెంప్షన్ ఆప్షన్లను తగ్గించడం వంటివి ఇందులో భాగమే.
ఇటీవలి కాలంలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులు గేమింగ్, ప్రభుత్వ చెల్లింపుల వంటి కొన్ని రకాల లావాదేవీలపై రివార్డులను పరిమితం చేశాయి. అలాగే, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ నిబంధనల్లోనూ కీలక మార్పులు చేపట్టాయి.
ఈ అంశంపై ఫిన్ టెక్ సంస్థ 'జాగల్' ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజ్ పి. నారాయణం మాట్లాడుతూ, "క్రెడిట్ కార్డ్ డీవాల్యుయేషన్ ప్రక్రియ నిశ్శబ్దంగా జరుగుతుంది. రివార్డ్ రేట్లు తగ్గించడం, క్యాష్‌బ్యాక్‌పై పరిమితులు విధించడం, రీడీమ్ చేసుకునే వస్తువుల జాబితాను కుదించడం వంటివి దీనికి ప్రాథమిక సంకేతాలు. కార్డుదారులు పాయింట్లను పోగుచేయకుండా ఎప్పటికప్పుడు రీడీమ్ చేసుకోవాలి. బ్యాంకుల నుంచి వచ్చే సమాచారాన్ని నిశితంగా గమనించాలి. వార్షిక ఫీజుకు తగిన ప్రయోజనాలు లభించనప్పుడు, వేరే కార్డుకు మారడం ఉత్తమం" అని సూచించారు.
రివార్డులను కాపాడుకోవడానికి మార్గాలు
పాయింట్లను వినియోగించుకోండి: రివార్డ్ పాయింట్లను భారీగా పోగుచేయకుండా ఎప్పటికప్పుడు ట్రావెల్ బుకింగ్స్, వోచర్లు లేదా క్యాష్‌బ్యాక్ కోసం రీడీమ్ చేసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో వాటి విలువ తగ్గినా నష్టం ఉండదు.
బ్యాంకు సందేశాలను గమనించండి: ఫీజులు, రివార్డుల నిబంధనల్లో మార్పుల గురించి బ్యాంకులు ఈమెయిల్, ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ద్వారా ఆకస్మిక మార్పుల వల్ల కలిగే ఇబ్బందులను నివారించవచ్చు.
ఫీజులు, ప్రయోజనాలను బేరీజు వేయండి: మీరు చెల్లించే వార్షిక ఫీజుకు తగిన ప్రయోజనాలు పొందుతున్నారో లేదో సమీక్షించుకోండి. ప్రయోజనాలు తక్కువగా ఉన్నట్లయితే, కార్డును మార్చడం లేదా డౌన్‌గ్రేడ్ చేయడం శ్రేయస్కరం.
ఒకటి కంటే ఎక్కువ కార్డులు: ఒకే కార్డుపై ఆధారపడకుండా, వేర్వేరు ప్రయోజనాలు అందించే రెండు మూడు కార్డులను వాడటం మేలు. దీనివల్ల ఏదైనా ఒక బ్యాంకు నిబంధనలను కఠినతరం చేసినా ప్రత్యామ్నాయం ఉంటుంది.
అధిక రివార్డులపై దృష్టి: ప్రయాణాలు, డైనింగ్, ఇంధనం వంటి ఏయే విభాగాలలో మీ కార్డు గరిష్ఠ రివార్డులను అందిస్తుందో గుర్తించి, వాటిపై ఖర్చు చేయడం ద్వారా అత్యధిక ప్రయోజనం పొందవచ్చు.
మారుతున్న ఈ తరుణంలో, వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా తమ కార్డుల నుంచి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.